Karimnagar: పాత స్థానానికే నాగరాజు.. రాయికల్‌కు మనోహర్ బదిలీ
Karimnagar: కరీంనగర్ జిల్లా చొప్పదండి మున్సిపాలిటీ కొత్త కమిషనర్‌గా కీర్తి నాగరాజు నియామకమయ్యారు.
Karimnagar: పాత స్థానానికే నాగరాజు.. రాయికల్‌కు మనోహర్ బదిలీ
కరీంనగర్ జిల్లా: చొప్పదండి మున్సిపాలిటీలో నూతన కమిషనర్‌గా కీర్తి నాగరాజు నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ కమిషనర్‌గా పనిచేస్తున్న మనోహర్‌ను రాయికల్‌కు బదిలీ చేశారు. ఇదే సమయంలో గతంలో చొప్పదండి మున్సిపాలిటీలో కమిషనర్‌గా సేవలందించిన కీర్తి నాగరాజును మళ్లీ అదే స్థానానికి బదిలీ చేయడం గమనార్హం. నూతన బాధ్యతలు స్వీకరించిన కీర్తి నాగరాజుకు మున్సిపల్ చైర్‌పర్సన్ వడ్లూరి సరితతో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన గత అనుభవంతో మున్సిపాలిటీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగరాజు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని, మున్సిపాలిటీ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని తెలిపారు.
Next Story




