Singareni: దమ్ముంటే సింగరేణికి బ్లాకులు ఇప్పించండి మిర్యాల రాజిరెడ్డి!
Singareni: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి చేపట్టిన భరోసా యాత్ర సింగరేణి కార్మికుల బతుకులను మార్చడానికి కాదని,
Singareni: దమ్ముంటే సింగరేణికి బ్లాకులు ఇప్పించండి మిర్యాల రాజిరెడ్డి!
సింగరేణి: గోదావరిఖని చౌరస్తాలోని TBGKS కేంద్ర కార్యాలయంలో బుదవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కిషన్ రెడ్డి భరోసా యాత్ర ద్వారా కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. వాటిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేస్తారని ఆశించిన కార్మికవర్గానికి నిరాశే ఎదురైందని అన్నారు.
సింగరేణి కార్మికుల 12వ వేజ్ బోర్డుపై గాని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆగిపోయిన మెడికల్ బోర్డు పై గానీ, కార్మికుల పేర్క్ పై ఇన్కమ్ టాక్స్ పై రద్దుపై గానీ ప్రకటన చేస్తారని, యాజమాన్యాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తారని కార్మికవర్గం అంతా ఎదురు చూడరని అన్నారు. కానీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా యాత్ర కార్మికవర్గంలో ఎలాంటి భరోసా కల్పించకపోగా, వారికి వారి పార్టీ శ్రేణులకు మాత్రం భరోసా కల్పించిందని ఎద్దేవా చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భరోసా యాత్ర సింగరేణి సొమ్ముతో జరిగిన బీజేపీ పార్టీ యాత్రగానే మిగిలిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సింగరేణిలో జరిగిన అనేక అవినీతి, కుంభకోణాలపై కిషన్ రెడ్డి పల్లెత్తుమాట కూడా అనకుండా సభ సాగడం విడ్డూరంగా ఉందన్నారు. వేలంపాటలో లేని 2013 లో అనుమతుల కోసం పెట్టిన తాడిచర్ల బ్లాక్ టూకు అనుమతులు ఇచ్చి తాము ఏదో సాధించినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.
దమ్ముంటే కిషన్ రెడ్డి వేలంపాట మిగతా బ్లాకులను సింగరేణికి ఇప్పించాలని, అలాగే అనుమతుల కోసం ఎదురు చూస్తున్న ఐదు ఓసీ లకు అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో TBGKS, BRS నాయకులు నూనె కొమురయ్య, పర్లపల్లి రవి, జాహిద్ పాషా,చెలుకలపల్లి శ్రీనివాస్, పోలాడి శ్రీనివాస్,దండే రవి,రాజ్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్,కిరణ్ జీ తదితరులు పాల్గొన్నారు.




