Sircilla: మహిళా సాధికారతే కాంగ్రెస్ లక్ష్యం సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి!
Sircilla: సిరిసిల్ల ఓబుళాపూర్, ఇందిరమ్మ కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేకే మహేందర్‌రెడ్డి. మహిళల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రాధాన్యం.
Sircilla: మహిళా సాధికారతే కాంగ్రెస్ లక్ష్యం సిరిసిల్లలో కేకే మహేందర్‌రెడ్డి!
Sircilla: మహిళల సాధికారతే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ, స్వయం ఉపాధి పథకాలను అమలు చేస్తోందని సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని తెలిపారు.
ఓబుళాపూర్, ఇందిరమ్మ కాలనీ (కేసీఆర్ నగర్)లో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేకే మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజల బతుకులు బాగుపడలేదని కేకే విమర్శించారు. పావలా వడ్డీకి సంబంధించిన డబ్బులను కూడా దోచుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ఆర్థిక భారం మోపిందన్నారు. రాష్ట్రంపై ఉన్న అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.
మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వావలంబన కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లకు బాటలు వేసిన ఘనత దివంగత రాజీవ్‌గాంధీదేనని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంత్యోదయ కార్డుల విధానానికి స్వస్తి పలికిందని విమర్శించిన కేకే.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు అందించే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పేదల సంక్షేమం, మహిళల అభ్యున్నతి, స్వయం ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
ఇదిలా ఉండగా.. ఓబుళాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత కొత్త రవిగౌడ్ కుమారుడి వివాహానికి కేకే మహేందర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.




