Rajannapet: రైతులకు గుడ్ న్యూస్.. గోదాం నిర్మాణానికి భూమిపూజ!

Rajannapet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన గోదాం భవనానికి భూమిపూజ జరిగింది.

KALEEM, SIRICILLA
Published on: 26 July 2026 7:45 PM IST
Rajannapet
X

Rajannapet: రైతులకు గుడ్ న్యూస్.. గోదాం నిర్మాణానికి భూమిపూజ!

రాజన్నపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట గ్రామంలో రూ.30 లక్షల నిధులతో నిర్మించనున్న గోదాం భవనానికి ఆదివారం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా గోదాం నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్లూరు బాపురెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ షేక్ సాబేరా బేగం, దొమ్మాటి నర్సయ్య, సది లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story