Sircilla: ఎగువ మానేరు ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిన కేకే మహేందర్ రెడ్డి!
Sircilla: సిరిసిల్ల నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు నిండుకుండలా మారిన నీటిమట్టం.
Sircilla: ఎగువ మానేరు ప్రాజెక్టుకు జలహారతి ఇచ్చిన కేకే మహేందర్ రెడ్డి!
సిరిసిల్ల: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్న నేపథ్యంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి బుధవారం ప్రాజెక్టును సందర్శించారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, జలాశయంలో పూలు సమర్పిస్తూ నీటికి హారతి ఇచ్చారు. అనంతరం ప్రాజెక్టులోకి వస్తున్న వరద ప్రవాహం, నీటి నిల్వలను పరిశీలించి అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని కోరారు. ప్రాజెక్టు సందర్శనలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




