Karimnagar: బండి సంజయ్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి!
Karimnagar: రాష్ట్ర ప్రభుత్వ నిధులను కేంద్ర నిధులుగా బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మండిపడ్డారు.
Karimnagar: బండి సంజయ్ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి!
Karimnagar: రాష్ట్ర ప్రభుత్వానితులను కేంద్ర ప్రభుత్వ నిధులని అబద్ధపు ప్రచారాలు చేస్తున్న కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ తప్పుడు ప్రచారాలు మానుకఅన్నారు మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నేడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 210 కోట్లు ఇస్తే, 840 కోట్లు తామే ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వాటా లేకుండా ఒక పని కూడా ఇప్పటివరకు చేయలేదని చివరికి స్మార్ట్ సిటీ నిధులు కూడా సగం సగం వాటాలు ఉన్నాయని ఇది తెల్వదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కి అప్పు ఇచ్చినంత మాత్రాన అవి కేంద్ర నిధులు కావని దీనిపై నివేదిక గైడ్లైన్స్ ఉన్నాయని వీటిపై విచారణకు మేము సిద్ధమని, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. మేము విచారణకు వస్తే మీరు అడ్డుకోవడం తప్ప ఏమి చేయలేరని, అందుకే గైడ్లైన్సును పోస్టులో పంపిస్తానని తెలిపారు.
ఎన్నికలకు ముందు నగర ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేశారని ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. జిల్లా ప్రజలు నిన్ను కార్పొరేటర్ గా,రెండుసార్లు పారేట్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే జిల్లా ప్రజలకు నువ్వు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నీవు నగర అభివృద్ధి కోసం రూపాయి తేలేదు అని వందలసార్లు నిన్ను తిట్టిన వాళ్లను నీ వద్ద ఉంచుకొని ఇప్పుడు నేను అభివృద్ధి ప్రదాయకున్ని అభివృద్ధి కోసం నిధులు పారిస్తున్న అంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేదని అన్నారు. నగర ప్రజల కోసం జిల్లా ప్రజల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఒక పరిశ్రమ కానీ, మరి ఏదైనా కానీ జిల్లా ప్రజల కోసం తీసుకురావాలని సూచించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులపై జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిపై మీతో బహిరంగ చర్చకు ఎక్కడికి రమ్మన్నా వస్తామని మీరు మాత్రమే సమాధానం చెప్పాలని దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ను మీకు పోస్టులో పంపిస్తున్నారని తెలిపారు.




