Konaraopet: కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్!

Konaraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బి. గితే. కేసుల పురోగతి సమీక్ష, సిబ్బందికి తగు ఆదేశాలు.

KALEEM, SIRICILLA
Published on: 21 Oct 2026 2:14 PM IST
Konaraopet
X

Konaraopet: కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ మహేష్!

Konaraopet: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల పురోగతి, పెండింగ్ దర్యాప్తులు, స్టేషన్ రికార్డులు, సిబ్బంది హాజరు, రౌడీషీటర్లు, నేరస్తులపై నిఘా, ప్రజలకు అందిస్తున్న సేవలను సమీక్షించారు.

పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ పరిధిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో అలసత్వం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వర్టికల్స్ వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును పరిశీలించి, ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై అవగాహన పెంచుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. డయల్ 112కు ఫోన్ కాల్ వచ్చిన వెంటనే పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అండగా నిలవాలని సూచించారు.

ఈ తనిఖీలో సీఐ రవికుమార్, ఎస్‌ఐ రామ్మోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA