Kondagattu: వేసవి సెలవుల సందడి.. కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ

Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 April 2026 4:15 PM IST
Kondagattu
X

Kondagattu: వేసవి సెలవుల సందడి.. కొండగట్టులో పెరిగిన భక్తుల రద్దీ

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు.

ఉదయం నుంచే భక్తులు కొండపైకి చేరుకుని ఆలయ పరిసరాల్లోని కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవలో తరిస్తూ కనిపించారు.

ఆలయ అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి నిత్యపూజలు, అభిషేకాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో కళకళలాడింది.

ఇక త్వరలో జరగనున్న పెద్ద జయంతి ఉత్సవాల దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, క్యూలైన్లు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

వేసవి సెలవుల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత మంది భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి క్షేత్రం భక్తులతో సందడిగా మారింది.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story