Kondagattu: కొండగట్టు అంజన్న ముడుపుల బహిరంగ వేలం!
Kondagattu: కొండగట్టు అంజన్న క్షేత్రంలో పెద్ద జయంతి ఉత్సవాల ముడుపుల బహిరంగ వేలం.
Kondagattu: కొండగట్టు అంజన్న ముడుపుల బహిరంగ వేలం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం లో నిర్వహించిన పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన ముడుపులను విప్పగా వచ్చిన బియ్యం ,మాలలు,ఎండు కొబ్బరి, ఈరోజు ఈఓ కార్యాలయంలో అధికారుల సమక్షంలో వేలం వేశారు.
భక్తులు సమర్పించిన మాలలు, బియ్యం, కొబ్బరికాయలు, ఎండు కూడకలను వేలం వేయగా దేవస్థానానికి గణనీయమైన ఆదాయం లభించింది. మాలలు – వనం అంజి రూ.5 లక్షల 90 వేలుకు దక్కించుకున్నారు. బియ్యం – జగిత్యాలకు చెందిన శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ కిలోకు రూ.15 లకు,కొబ్బరికాయలు – వరంగల్‌కు చెందిన పి. ప్రభాకర్ రూ.51 వేలకు,ఎండు కూడకలు – పుత్తూరి సమ్మయ్య కిలోకు రూ.95 లకు దక్కించుకొన్నారు
పెద్ద జయంతి సందర్భంగా భక్తులు సమర్పించిన ముడుపులకు భారీ స్థాయిలో స్పందన లభించడంతో దేవస్థానానికి మంచి ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి ,దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రాజమౌళి,సుపేరెండేంట్ సునీల్,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు ఉన్నారు.




