Jagtial: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్
Jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజనేయ స్వామి వారిని అయ్యప్ప మాలధారణలో దర్శించుకున్న నటుడు మేకా శ్రీకాంత్. ప్రత్యేక పూజల అనంతరం పేదలకు ఆర్థిక సాయం అందజేత.
Jagtial: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్
జగిత్యాల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి వారిని సినీ నటుడు మేకా శ్రీకాంత్ మంగళవారం దర్శించుకున్నారు. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి వచ్చిన శ్రీకాంత్‌కు అర్చకులు ఘనంగా స్వాగతం పలికి, ఆయన గోత్రనామాలతో పూజలు జరిపి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ... కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం తనకు ఇది నాలుగోసారి అని సంతోషం వ్యక్తం చేశారు.
స్వామివారిని నమ్మకున్న భక్తులకు ఎలాంటి కష్టాలు ఉండవని, ప్రతి ఒక్కరిపై అంజన్న ఆశీస్సులు ఉండి ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కొండగట్టు అంజన్న కోరిన కోర్కెలు తీర్చే ప్రత్యక్ష దైవమని కొనియాడారు.
ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందని ఆయన వెల్లడించారు. స్వామివారి దర్శనం ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో ఆలయ పరిసరాల్లో ఉన్న పేదలకు, భిక్షాటకులకు శ్రీకాంత్ ఆర్థిక సహాయం అందజేసి తన ఉదారతను చాటుకున్నారు.




