Kondagattu: గిరి ప్రదక్షిణకు కొత్త రహదారి.. 9 ఆంజనేయ విగ్రహాల ఏర్పాటు!
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో గిరి ప్రదక్షిణను సులభతరం చేసేందుకు కొత్త రహదారి నిర్మాణానికి స్థల పరిశీలన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
Kondagattu: గిరి ప్రదక్షిణకు కొత్త రహదారి.. 9 ఆంజనేయ విగ్రహాల ఏర్పాటు!
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలో గిరి ప్రదక్షిణను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు కొత్త రహదారి నిర్మాణానికి స్థల పరిశీలన చేపట్టినట్లు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు సురేష్ ఆత్మారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండగట్టు ఘాట్ రోడ్ ప్రారంభంలో ఎడమవైపు ఉన్న జలబుగ్గ నుంచి కొత్త గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించి, మరో దారి ద్వారా ప్రదక్షిణ పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. భక్తులు సురక్షితంగా, సౌకర్యవంతంగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసేలా మార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా, భక్తులకు శ్రీ ఆంజనేయస్వామి చరిత్రను తెలియజేసే ఉద్దేశంతో గిరి ప్రదక్షిణ మార్గంలో తొమ్మిది ముఖ్య ప్రదేశాల్లో శ్రీ ఆంజనేయస్వామి తొమ్మిది విభిన్న స్వరూపాల విగ్రహాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం అమలులోకి వస్తే కొండగట్టు గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతితో పాటు, శ్రీ ఆంజనేయస్వామి వైభవాన్ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.




