Kondagattu: కొండగట్టులో వైభవంగా జ్యేష్ఠాభిషేకం: 108 కలశాలతో అంజన్నకు ప్రత్యేక పూజలు!
Kondagattu: జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం వైభవం. పంచామృతాభిషేకాలు, 108 కలశాల అలంకరణలో అంజన్న, భారీగా తరలివచ్చిన భక్తులు.
Kondagattu: కొండగట్టులో వైభవంగా జ్యేష్ఠాభిషేకం: 108 కలశాలతో అంజన్నకు ప్రత్యేక పూజలు!
కొండగట్టు, జగిత్యాల: జగిత్యాల జిల్లా మాల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పవిత్ర జలాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పండ్ల రసాలతో పంచామృతాభిషేకం నిర్వహించి స్వామివారిని విశేషంగా 108 కలశాలను అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు ఆలయ అర్చక స్వాములు నిర్వహించారు.
జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి మరియు అర్చకులు అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జ్యేష్ఠాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ముగిసింది.




