Kondagattu: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు పూర్తి

Kondagattu: మూడు రోజుల హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 9 May 2026 12:29 PM IST
Kondagattu
X

Kondagattu

Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం లో రేపటి నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్ళు. తాగునీరు, పార్కింగ్, క్యూలైన్లు, ప్రసాదాల పంపిణీ, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సదుపాయాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే ఆలయ పరిసరాల్లో ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, మహా హారతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో భక్తులు సహకరించి ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story