Jagtial: కొండగట్టులో హనుమాన్ జయంతి సంబరాలు.. భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం!

Jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు. రెండో రోజు స్వామివారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 11 May 2026 7:53 AM IST
Jagtial
X

Jagtial: కొండగట్టులో హనుమాన్ జయంతి సంబరాలు.. భక్తులతో కిక్కిరిసిన క్షేత్రం!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలం కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు రెండవ రోజు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మాలవిరమణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

“జై శ్రీరామ్.. జై హనుమాన్” నినాదాలతో కొండగట్టు ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహిస్తూ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ, భద్రతా చర్యలు వంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు క్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story