Jagtial: కొండగట్టులో భక్తుల జాతర.. అంజన్న సన్నిధిలో రద్దీ!

Jagtial: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ. హనుమాన్ జయంతి నేపథ్యంలో పోటెత్తిన భక్తులు.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 5 May 2026 11:09 AM IST
Jagtial
X

Jagtial: కొండగట్టులో భక్తుల జాతర.. అంజన్న సన్నిధిలో రద్దీ!

జగిత్యాల జిల్లా: మల్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ అంజన్న ఆలయం లో మంగళవారం సందర్భంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మంగళవారం హనుమాన్ స్వామికి ప్రత్యేకమైన రోజు కావడంతో ఉదయం తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిక్కిరిసిపోయి “జై హనుమాన్”, “జై శ్రీరామ్” నినాదాలతో మారుమోగింది. ఈ నినాదాలు భక్తి భావాన్ని మరింత ఉద్ధీపన చేసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల భక్తులు స్వామివారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.

సమీపిస్తున్న హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రాక మరింత పెరిగింది. తెలంగాణతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. కొందరు భక్తులు దీక్షలు చేపట్టి పాదయాత్రగా ఆలయానికి చేరుకోవడం విశేషంగా కనిపించింది. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తమ కోరికలను స్వామివారికి తెలియజేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేశారు. దర్శనానికి ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, తాగునీటి సౌకర్యం, ప్రసాద పంపిణీ, పారిశుధ్య చర్యలు చేపట్టారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story