Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయ నూతన ముఖద్వారం ప్రారంభం!
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రంలో నూతనంగా నిర్మించిన ప్రధాన ముఖద్వారాన్ని ఈఓ అంజనారెడ్డితో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం.
Kondagattu: కొండగట్టు అంజన్న ఆలయ నూతన ముఖద్వారం ప్రారంభం!
Kondagattu: జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన ప్రధాన ముఖద్వారాన్ని స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శనివారం ప్రత్యేక పూజల నడుమ ప్రారంభించారు.
ఆలయ పాత ముఖద్వారం శిథిలావస్థకు చేరడంతో, భక్తుల సౌకర్యం మరియు ఆలయ సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం నూతన ముఖద్వారాన్ని నిర్మించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన పూజల అనంతరం ఎమ్మెల్యే ముఖద్వారాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి, ఏఈఓ హరిహారనాథ్, సూపరింటెండెంట్లు చంద్రశేఖర్, సునీల్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అశోక్, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
Next Story




