Manthani: మంథని విద్యార్థి యువత 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి!

Manthani: మంథని విద్యార్థి యువత 2000వ కార్యక్రమం 'మంత్రపురి యశస్సు - విపంచిక' పోస్టర్‌ను మంథనిలో ఆవిష్కరించారు.

SHANKAR, MANTHANI
Published on: 25 Aug 2026 8:20 PM IST
Manthani
X

Manthani: మంథని విద్యార్థి యువత 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి!

మంథాని: మంత్రపురి యశస్సు పతాకంగా మంథని విద్యార్థి యువత సంస్థ 2000వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి కోరారు.

మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథనిలోని మంథని విద్యార్థి యువత (ఎం వి ఐ) కార్యాలయంలో మంథని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆంకరి కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు, రాష్ట్ర వ్యవసాయ శాఖ రీజినల్ విశ్రాంత అధికారి తనుగుల విజయ్ కుమార్ చేతుల మీదుగా "మంథని విద్యార్థి యువత - 2000 ప్రోగ్రాం" పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కొండేల మారుతి మాట్లాడుతూ, మంథని ప్రాంత ఘనతను చాటేలా రానున్న నెలలో 'మంత్రపురి యశస్సు - విపంచిక' కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మంథని ప్రాంత ముద్దుబిడ్డలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిన సేవాతత్పరుల సమాహారంగా, సందేశాత్మక విశిష్టతతో ఈ వేడుకను రూపకల్పన చేస్తున్నామన్నారు.

అతిరథ మహారథుల వేదికగా జరగనున్న ఈ వేడుకలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం జరిగిన సభలో బీజేపీ నాయకులు బోగోజు శ్రీనివాస్, నారమల్ల కృష్ణ, వైశ్య సంఘం నాయకులు కొమురవెల్లి సత్యనారాయణ, కొత్త శ్రీనివాస్, వొల్లాల అశోక్, కాంగ్రెస్ నాయకులు వేల్పుల సత్యం తదితరులు ప్రసంగించారు. ఎం.వి.వై 2000 - మంత్రపురి యశస్సు కార్యక్రమ వివరాలకు కొండేల మారుతి - 93475 90795 నంబర్ లో సంప్రదించాలన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story