Jagtial: కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ తీవ్ర నిర్వీర్యం మాజీ మంత్రి!

Jagtial: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాలలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

ANAND, JAGITYAL
Published on: 24 Aug 2026 1:19 PM IST
Jagtial
X

Jagtial: కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ తీవ్ర నిర్వీర్యం మాజీ మంత్రి!

Jagtial: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఆరోపణలు - ముఖ్యాంశాలు:

పాఠశాలల మూసివేత: కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 2,000 పాఠశాలలు మూతపడ్డాయని, ఏకంగా 1,26,000 అడ్మిషన్లు తగ్గయని ఆందోళన వ్యక్తం చేశారు.

గురుకులాల నిర్లక్ష్యం: కేసీఆర్ ప్రభుత్వం 1,000 గురుకులాలు స్థాపించి 7 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వివిధ కారణాలతో 107 మంది విద్యార్థులు మరణించారని మండిపడ్డారు.

యంగ్ ఇండియా బడులపై విమర్శ: గురుకులాలను దెబ్బతీసేందుకే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లక్ష్మణ్ కుమార్ కలిసి 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు' తీసుకువచ్చారని ఆరోపించారు.

పాలిటెక్నిక్ విద్యకు గండి: రాష్ట్రంలో ఉన్న 97 ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల వ్యవస్థను నాశనం చేసేందుకే ప్రభుత్వం జి.ఓ. 97ని తీసుకువచ్చిందని విమర్శించారు.

ANAND, JAGITYAL

ANAND, JAGITYAL

Next Story