Manthani: వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొత్త శ్రీనివాస్!

Manthani: వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మంథనికి చెందిన కొత్త శ్రీనివాస్, కార్యదర్శిగా ఓల్లాల నాగరాజు నియామకం హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందజేత.

SHANKAR, MANTHANI
Published on: 28 Sept 2026 5:44 PM IST
Manthani
X

Manthani: వాసవి సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొత్త శ్రీనివాస్!

మంథాని: వాసవి సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొత్త శ్రీనివాస్, కార్యదర్శిగా ఓల్లాల నాగరాజు నియమితులయ్యారు. హైదరాబాద్ లో ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వాసవి సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మాంకాళి విజయ్ కుమార్, మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణలు నియామక పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ తమ నియామకానికి సహకరించిన పెద్దపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నల్మాస్ ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆర్యవైశ్య సంఘ సేవా కార్యక్రమాలకు తమ వంతు కృషి చేస్తామని కొత్త శ్రీనివాస్, ఓల్లాల నాగరాజులు తెలిపారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI