Jamikunta: కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Jamikunta: కరీంనగర్ జమ్మికుంట మండలం కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు. విద్యార్థుల కృష్ణా గోపికల వేషధారణలు, ఉట్టి కొట్టే పోటీలు అలరించాయి.
Jamikunta: కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు!
Jamikunta: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు గోపిక శ్రీకృష్ణుని వేషధారణలో కోలాటాలు పట్టుకొని పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అందరిని విశేషంగా ఆకట్టుకున్నారు. అనంతరం పాఠశాల కార్యక్రమాన్ని నిర్వహించగా విద్యార్థులు పోటీపడి ఉట్టిని కొట్టారు. పుట్టిన కొట్టిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించడంతోపాటు ఆ పండుగల యొక్క విశిష్టతలను విద్యార్థులకు తెలిసేలా చేయడం జరుగుతుందని విద్యార్థుల ను తయారు చేసేందుకు సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు బలరాం, కుమారి ,రేఖ ,శైలజ తదితరులు పాల్గొన్నారు.




