Ramagundam: ఉత్సాహంగా కృష్ణవేణి విద్యాసంస్థల ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ రెండవ రోజు వేడుకలు
Ramagundam: కృష్ణవేణి విద్యాసంస్థల ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ ఈవెంట్ 2026 రెండవ రోజు కోకో, వాలీబాల్, త్రోబాల్ పోటీలు విద్యార్థుల క్రీడా స్ఫూర్తితో అట్టహాసంగా నిర్వహణ.
Ramagundam: ఉత్సాహంగా కృష్ణవేణి విద్యాసంస్థల ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ రెండవ రోజు వేడుకలు
రామగుండం: కృష్ణవేణి విద్యాసంస్థల ఇంట్రామ్యూరల్ స్పోర్ట్స్ ఈవెంట్ 2026 విద్యార్థుల క్రీడా స్ఫూర్తితో అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ మేరకు రెండవరోజు కృష్ణవేణి విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ ను నిర్వహించారు. రెండవరోజు KTS మార్కండేయ కాలనీ బ్రాంచ్ లో అండర్ 14, అండర్ 17 విభాగాల్లో విద్యార్థినిలకు కోకో పోటీలను నిర్వహించారు. అలాగే KTS అయాన్ బ్రాంచ్ లో విద్యార్థులకు వాలి బాల్ పోటీలను నిర్వహించారు.
ఈ పోటీల అనంతరం త్రో బాల్, షాట్ ఫుట్ పోటీలను నిర్వహించగా కృష్ణవేణి విద్యాసంస్థల లోని KTS అడ్డగుంటపల్లి బ్రాంచ్, KTS అయాన్ బ్రాంచ్, KTS మార్కండేయ కాలనీ బ్రాంచ్, KTS - NTPC బ్రాంచ్ ల విద్యార్థులు ఉత్సాహంగా కోకో, త్రో బాల్, షాట్ ఫుట్ పోటీలలో పాల్గొన్నారు.
అందరూ క్రీడా స్ఫూర్తితో వ్యవహరిస్తూ గెలుపు ఓటములను ఒకేలా తీసుకుంటూ అన్ని బ్రాంచీల ప్రిన్సిపాల్ లు , ఉపాధ్యాయులు, PET లు, విద్యార్థిని, విద్యార్థులు ఎవ్వరు గెలిచినా మన కృష్ణవేణి విద్యాసంస్థల పిల్లలే గెలిచారన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను ఎంకరేజ్ చేశారు.




