Veernapalli: బాధితులకు బిల్లులు చెల్లించేలా కృషి చేస్తా కేటీఆర్!
Veernapalli:వీర్నపల్లి రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు వెంటనే అందేలా కృషి చేస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR హామీ ఇచ్చారు.
Veernapalli: బాధితులకు బిల్లులు చెల్లించేలా కృషి చేస్తా కేటీఆర్!
Veernapalli: వీర్నపల్లి మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, అభివృద్ధి పనుల్లో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు అందలేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు కేటీఆర్‌కు వినతిపత్రం అందజేశారు. తమ సమస్యను పరిష్కరించి, బిల్లులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారికి రావాల్సిన బిల్లులు అందేలా తప్పకుండా కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. దీంతో తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని బాధితులు వ్యక్తం చేశారు.




