Sircilla: కేటీఆర్ చొరవతో దుబాయ్ నుంచి రవి మృతదేహం స్వగ్రామానికి

Sircilla: దుబాయ్‌లో మృతి చెందిన సిరిసిల్ల తంగళ్లపల్లికి చెందిన ఓల్లపు రవి మృతదేహం కేటీఆర్ చొరవతో 5 రోజుల్లోనే స్వగ్రామానికి చేరుకుంది.

KALEEM, SIRICILLA
Published on: 20 Sept 2026 2:58 PM IST
Sircilla
X

Sircilla: కేటీఆర్ చొరవతో దుబాయ్ నుంచి రవి మృతదేహం స్వగ్రామానికి

సిరిసిల్ల: దుబాయ్‌లో మృతి చెందిన తంగళ్లపల్లి మండలానికి చెందిన ఓల్లపు రవి పార్థివదేహం ఐదు రోజుల్లోనే స్వగ్రామానికి చేరుకుంది. బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ ఈ విషయాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో, ఆయన సహకారంతో పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు.

తంగళ్లపల్లికి చేరుకున్న ఓల్లపు రవి పార్థివదేహానికి బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు బొల్లి రామ్మోహన్, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు పడిగేల మానస–రాజు, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు బండి జగన్, ఏం.డి. హమీద్, బగ్గు లింగం తదితర బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా రవి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని నాయకులు తెలిపారు. పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి సహకరించిన కేటీఆర్‌కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA