Manthani: మంథని, రామగిరిల్లో బీఆర్‌ఎస్ శ్రేణుల అరెస్టులు!

Manthani: కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ పర్యటన వేళ మంథనిలో ఉద్రిక్తత నెలకొంది. వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు 20 మంది బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

SHANKAR, MANTHANI
Published on: 5 July 2026 11:52 AM IST
Manthani
X

Manthani: మంథని, రామగిరిల్లో బీఆర్‌ఎస్ శ్రేణుల అరెస్టులు!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో పోలీసులు భారీగా మోహరించారు. జయశంకర్ భూపాల్ పల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ శ్రేణులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మంథని నుండి మహాదేవపూర్ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

మంథని, రామగిరి, కమాన్‌పూర్ తదితర మండలాల్లోని సుమారు 20 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story