Karimnagar: డిజిటల్ మెంబర్‌షిప్ రచ్చ: కేటీఆర్ నివాసంలో మంథని ఇన్‌చార్జ్ భేటీ!

Karimnagar: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ వ్యాప్తంగా డిజిటల్ సభ్యత్వ నమోదు వేగంగా సాగుతోంది.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 25 May 2026 11:12 AM IST
Karimnagar
X

Karimnagar: డిజిటల్ మెంబర్‌షిప్ రచ్చ: కేటీఆర్ నివాసంలో మంథని ఇన్‌చార్జ్ భేటీ!

Hyderabad: కేటీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి పార్టీ చేపట్టిన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంథని నియోజకవర్గ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిగా నియమితులైన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ జిల్లా రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుండి బూత్ స్థాయి వరకు సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టడం ద్వారా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మరింత సౌలభ్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.

మంథని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు యువత, మహిళలు, కార్యకర్తలను సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కేటీఆర్ సూచించినట్లు తెలిసింది. పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని వీర్ల వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ భేటీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా, మంథని నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మరింత వేగవంతం కానుందని కార్యకర్తలు భావిస్తున్నారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story