Karimnagar: కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్.. నగరం అంతటా భారీ బందోబస్తు
Karimnagar: వామపక్ష విద్యార్థి సంఘాల బంద్, ఎంపీ బండి సంజయ్ ఆఫీస్ ముట్టడి పిలుపుతో కరీంనగర్‌లో ఉద్రిక్తత నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Karimnagar: కరీంనగర్‌లో విద్యాసంస్థల బంద్.. నగరం అంతటా భారీ బందోబస్తు
బందు పిలుపుతో నగరంలో భారీ బందోబస్తు
కరీంనగర్: విద్యాసంస్థల బంధు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘం నాయకులు. విద్యాసంస్థల బంధు పిలుపుతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేసిన పోలీసులు.నగరంలోని ప్రధాన కూడళ్ళు, కళాశాలల ముందు పోలీసులు భారీగా మోహరించారు.
ప్రైవేట్ కళాశాలలు స్వచ్ఛందంగా బంధు పాటించగా, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం, విద్యార్థులు హాజరయ్యారు. నగరంలో పరిస్థితులను స్వయంగా పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్ గౌస్ అలాం.
సిబ్బందికి తగిన సూచనలు చేసి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎంపీ కార్యాలయ ముట్టడికి పిలుపు..
ఢిల్లీలో జరిగిన గొడవలు, విద్యార్థులపై దాడిని నిరసిస్తూ, కళాశాలల బంద్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో, ఎంపీ ఆఫీస్ ముందు భారీగా పోలీసులు మోహందించారు. కరీంనగర్ లో జరుగుతున్న ఘటనలతో పోలీసులు భారీగా మోహరించారు.




