Karimnagar: కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం!

Karimnagar: కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ 23వ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది.

G. SUDHAKAR, KARIMNAGAR
Published on: 22 Jun 2026 8:15 AM IST
Karimnagar
X

Karimnagar: కరీంనగర్ శాతవాహన లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం!

కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్, రామచంద్రాపూర్ కాలనీలో గల శ్రీ కన్వెన్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ శాతవాహన (డిస్ట్రిక్ట్ 320G, రీజియన్-I, జోన్-II) 23వ ప్రతిష్ఠాపన (ఇన్‌స్టాలేషన్) మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా 2026-27 లయనిస్టిక్ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. క్లబ్ అధ్యక్షుడిగా లయన్ మహేందర్ మర్రిపెల్లి, ప్రధాన కార్యదర్శిగా లయన్ వేణుగోపాల్ నార్ల, కోశాధికారిగా లయన్ ప్రవీణ్ కుమార్ మెరుగు (సీఏ) బాధ్యతలు స్వీకరించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ఇన్‌స్టాలేషన్ అధికారిగా పాస్ట్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ లయన్ హన్మండ్ల రాజిరెడ్డి (పిఎంజెఎఫ్) హాజరై నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. విశిష్ట అతిథిగా పీడీజీ, డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్వైజర్ లయన్ కొండ వేణుమూర్తి ( పిఎంజెఎఫ్ ) పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. కరీంనగర్ శాతవాహన క్లబ్ గత 22 ఏళ్లుగా విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవ రంగాల్లో విశేష సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిందని కొనియాడారు.

నూతన కార్యవర్గం కూడా అదే సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.నూతన నాయకత్వంలో శాతవాహన లయన్స్ క్లబ్ సమాజ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని పలువురు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ ఎక్స్‌టెన్షన్ చైర్మన్ లయన్ సానా వేణు, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ వల్లాల కృష్ణహరి, డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ కొల్లూరి ఆనందం, రీజియన్ చైర్‌పర్సన్ లయన్ బొందిలి సరళ, జోన్ చైర్‌పర్సన్ లయన్ చౌటపల్లి సత్యనారాయణ రావు, ప్రోగ్రాం చైర్‌పర్సన్ లయన్ ఎనుగర్తి రమేష్, కో-చైర్‌పర్సన్ లయన్ వి. జగదీశ్వరాచారి, లయన్ తిరుపతి రెడ్డి దాసరి,క్లబ్ సభ్యులు, లయన్స్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

G. SUDHAKAR, KARIMNAGAR

G. SUDHAKAR, KARIMNAGAR

Next Story