Peddapalli: కొయ్యడ కొమురయ్యకు స్థానిక నాయకుల నివాళి!

Peddapalli: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో మంత్రి వివేక్ వెంకటస్వామి గన్ మెన్ లక్ష్మణ్ తండ్రి కొయ్యడ కొమురయ్య మృతికి స్థానిక నాయకులు సంతాపం తెలిపారు.

RAJU, PEDDAPALLI
Published on: 6 Nov 2026 12:15 PM IST
Peddapalli
X

Peddapalli: కొయ్యడ కొమురయ్యకు స్థానిక నాయకుల నివాళి!

Peddapalli: పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి గన్ మెన్ లక్ష్మణ్ తండ్రి కొయ్యడ కొమురయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు.

విషయం తెలుసుకున్న స్థానిక నాయకులు ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొయ్యడ కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

కుటుంబానికి అండగా ఉంటామని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కొమురయ్య మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బంధువులు, స్థానికులు పాల్గొన్నారు.

RAJU, PEDDAPALLI

RAJU, PEDDAPALLI