Thimmapur: ఎల్‌ఎండీ బీచ్‌లా మారింది.. కానీ అక్కడ మృత్యువు పొంచి ఉంది!
Thimmapur: ఎల్‌ఎండీ జలాశయంలో పర్యాటకుల రద్దీ పెరిగింది.
Thimmapur: ఎల్‌ఎండీ బీచ్‌లా మారింది.. కానీ అక్కడ మృత్యువు పొంచి ఉంది!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి జలాశయంలో ప్రస్తుతం నీటిమట్టం తగ్గడంతో ఆ ప్రాంతం ఒక బీచ్‌ను తలపిస్తోంది. దీనివల్ల పర్యాటకుల రాక బాగా పెరిగింది. ముఖ్యంగా ఆదివారం రోజుల్లో ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటోంది.
పర్యాటకులు ఆహ్లాదకరమైన వాతావరణంలో మానేరు నీటిలో స్నానాలు చేస్తూ ఎగిసిపడుతున్న అలలను చూస్తూ ఆనందిస్తున్నారు. అయితే ఈ ఆనందం వెనుక పెద్ద ప్రమాదాలు పొంచి ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రిజర్వాయర్‌లో గతంలో మట్టి తీయడం వల్ల ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. నీటి లోతు తెలియక దిగితే ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉందని కొందరు యువకులు నీటిలో మరియు ఒడ్డున కార్లతో ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తున్నారు. నది తీరంలో కూర్చుని మద్యం సేవించడమే కాకుండా, ఖాళీ సీసాలను అక్కడే పగలగొడుతున్నారు. ఇది పర్యాటకులకు, ముఖ్యంగా పిల్లలకు గాయాలయ్యేలా చేస్తోంది.
పర్యాటకులు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, ప్రమాదాలు జరగకముందే పోలీసులు ఇక్కడ పెట్రోలింగ్ నిర్వహించి తగిన జాగ్రత్తలు మరియు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.




