Jagtial: తృటిలో తప్పిన ప్రాణాపాయం.. డ్రైవర్ సురక్షితం

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.

N. Madhusudan Reddy, Karimnagar
Published on: 27 April 2026 7:13 PM IST
Jagtial
X

Jagtial: తృటిలో తప్పిన ప్రాణాపాయం.. డ్రైవర్ సురక్షితం

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలో ఒక ట్రాక్టర్‌లో ఆకస్మికంగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారం ప్రకారం, నమిలకొండ గ్రామానికి చెందిన ఇటుక బట్టీల నుండి వేములవాడ వైపు ఇటుక లోడుతో ట్రాక్టర్ వెళ్తుండగా నల్లగొండ గ్రామానికి చేరుకోగానే ఇంజన్ భాగం నుంచి పొగలు రావడం డ్రైవర్ గమనించాడు. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు.

అయితే క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి ట్రాక్టర్‌ను పూర్తిగా చుట్టుముట్టాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే వాహనం పూర్తిగా అగ్నికి ఆహుతైంది. అదృష్టవశాత్తూ డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

N. Madhusudan Reddy, Karimnagar

N. Madhusudan Reddy, Karimnagar

Next Story