Pegadapalli: అగ్నిప్రమాదంలో దగ్ధమైన మొక్కజొన్న పంట.. సాయం డిమాండ్
Pegadapalli: కాల్వ శ్రీరాంపూర్ మండలంలో అగ్నిప్రమాదంతో మొక్కజొన్న పంట దగ్ధమవడంతో బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
Pegadapalli
Pegadapalli: ప్రమాదవశాత్తు నిప్పు ఆట్టుకొని మొక్కజొన్న పంట దగ్ధమైన రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ లు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామానికి చెందిన గోపి శ్రీనివాస్ అనే రైతు ఎకరం నర భూమి కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేయగా ప్రమాదవశాత్తుకొని పంట పూర్తిగా దగ్ధం అయ్యింది. దగ్ధమైన పంటను మాజీ జెడ్పిటిసి వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్ లు పరిశీలించి రైతు శ్రీనివాస్ కు అధైర్య పడాలని సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు నిప్పంటుకొని మొక్కజొన్న పంట దగ్ధం కావడం బాధాకరణమన్నారు.
రైతు భూమిని కౌలు తీసుకొని మక్క పంట వేసుకుంటే పంట చేతికొచ్చే సమయానికి ఈ ఘటన జరగడం దురదృష్టం అన్నారు. సుమారు రైతు లక్ష యాభై వేల నష్టం జరిగిందన్నారు.ప్రభుత్వం తక్షణ చర్య కింద ఆదుకోవాలని, ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా రైతులకు రైతుబంధు కూడా ఇవ్వకపోవడం, కౌలు రైతులకు రైతుబంధు రాక, కౌలు తీసుకొని పంట సాగు చేస్తున్నాడని జిల్లా కలెక్టర్,ఎమ్మెల్యే దృష్టి సారించి, ప్రభుత్వం వెంటనే రైతును ఆదుకోవాలని,వారు కోరారు.ఈ కార్యక్రమంలో జంగా శ్రీనివాస్ రెడ్డి, సుముఖం రవీందర్ రెడ్డి,నక్కల రాయమల్లు,అల్లంల సదయ్య,సుఖేందర్ రెడ్డి, శ్రీనివాస్ పెంట రవి,తదితరులు పాల్గొన్నారు.
బైట్
1, వంగల తిరుపతిరెడ్డి,మాజీ జెడ్పిటిసి
2, నూనేటి సంపత్ యాదవ్,మాజీ ఎంపీపీ.




