Makthal: భూముల రీ సర్వేతో రైతులకు శాశ్వత పరిష్కారం

Makthal: మక్తల్ మండలం తిరుమలాపూర్‌లో భూముల రీ సర్వేను తనిఖీ చేసిన కలెక్టర్ సిహెచ్ ప్రియాంక; 450 ఎకరాల సర్వే పూర్తి, డిజిటల్ మ్యాప్‌లపై వివరణ.

B. NARENDER, MAKTHAL
Published on: 23 Nov 2026 11:15 PM IST
Makthal
X

Makthal: భూముల రీ సర్వేతో రైతులకు శాశ్వత పరిష్కారం

మక్తల్: భూముల రి సర్వే వల్ల రైతులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తెలిపారు. సోమవారం మక్తల్ మండలంలోని తిరుమలాపూర్ లో జరుగుతున్న భూముల రి సర్వేను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో 120 మంది రైతులకు రీసర్వ్ చేశామని 450 ఎకరాలు రీసర్వే పూర్తి అయినది అని ఎమ్మార్వో తెలిపారు. ఎకరా కన్న తక్కువ ఉన్నవారు ఎంతమంది అని అడిగిన కలెక్టర్. సర్వేతో ఎంతో ఉపయోగం ఉన్నదని తెలిపారు.

ఒక రైతుకు ఎనిమిది ఎకరాలు కాగా అట్టి భూమిని సర్వే చేస్తే కరెక్టుగా ఉన్నదని రైతు తెలిపారు. ముసలాయి పల్లెలో సర్వే పూర్తి అయిందని తాసిల్దార్ తెలిపారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్ లో పెడుతున్నట్లు అధికారులు కలెక్టర్కు తెలిపారు. పాస్ బుక్ లో ఉన్న రికార్డు ప్రకారం సర్వే చేస్తున్నారని సర్వే అయిన తర్వాత తాసిల్దార్ వెరిఫై చేస్తారన్నారు. రైతులకు ఎలాంటి నష్టం జరగదని కలెక్టర్ రైతులకు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే వల్ల రైతులకు శాశ్వతంగా భూ సమస్యలు ఉండవని తెలిపారు. 80 ఏళ్ల క్రితం నిర్వహించిన సర్వే వల్ల రైతులకు ఇబ్బందిగా మారడంతో ఇప్పుడు సర్వే చేస్తున్నందున ప్రతి రైతుకు డిజిటల్ మ్యాప్ సర్వే నంబర్లు వస్తాయని తెలిపారు. రైతులుకు ముందే నోటీసులు అందజేసి వారి పాసుబుక్కులో ఉన్న ప్రకారంగా సర్వే చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అధికారులు సర్వే సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL