Sircilla: వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం వచ్చే వరకు ఉద్యమం

Sircilla: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం తెచ్చేవరకు శాంతియుత ఉద్యమం చేస్తామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డా. ఆర్.ఎస్. రత్నాకర్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 12 July 2026 11:56 PM IST
Sircilla
X

Sircilla: వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం వచ్చే వరకు ఉద్యమం

సిరిసిల్ల: ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితులపై రాజకీయ కుట్ర జరుగుతోందని నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ మాల మహానాడు అండ్ రాక్స్ డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టం చేసేంత వరకు శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణకు మొదట హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే శ్రీకారం చుట్టాయని, అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా అమలు చేశారని విమర్శించారు.

ఎస్సీ రిజర్వేషన్ల ప్రయోజనం అందరికీ సమానంగా చేరడం లేదని, సామాజిక న్యాయం పేరుతో దేశంలోని 1108 ఎస్సీ కులాలకు రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన విభజిస్తారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

అదే విధంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వర్గీకరణ అమలు విధానంపై ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ఈ ప్రక్రియ దళితుల ఐక్యతను దెబ్బతీసే కుట్రగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని వివక్ష చూపుతున్నారని ఆరోపించిన రత్నాకర్, మాల ప్రజాప్రతినిధులు ఈ అంశంపై మౌనం వీడి స్పందించాలని పిలుపునిచ్చారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA

Next Story