Konaraopeta: ప్రశ్నిస్తే దాడి చేస్తారా?.. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్!
Konaraopeta: గ్రామ సభలో లెక్కలు అడిగిన యువకుడిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కోనరావుపేటలో జాతీయ మాల మహానాడు, మాలల ఐక్యవేదిక నేతలు డిమాండ్ చేశారు.
Konaraopeta: ప్రశ్నిస్తే దాడి చేస్తారా?.. నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్!
Konaraopeta: ఈరోజు కోనరావుపేట మండల కేంద్రములోని అంబెడ్కర్ చౌరస్తాలో జాతీయ మాల మహానాడు &మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పత్రిక ప్రకటన చేయడం జరిగినది తేదీ 21-11-2026వరోజున కోనరావుపేట, పేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన మన మాలబిడ్డా తిక్కల నవీన్ పై గ్రామ సభలో బతుకమ్మ, దసరా,
లెక్కలు అడుగుతుంటే నన్ను లెక్కలు అడుగుతావాఅని గ్రామ సభలోనే సెక్రటరీ, వార్డు సభ్యుల సమక్షంలో ఆకారణంగా గ్రామ సర్పంచ్ భర్త షేక్ పిరోజ్ పాషా దాడి చేయడం జరిగినది.
ఇటువంటి దాడులు పునవృతం కాకుండా ఇంకొకరు, దాడి చేయాలానే ఆలోచన రాకుండా, 23-11-2026వ రోజున కోనరావుపేట సబ్ ఇన్స్పెక్టర్ గారికి పిర్యాదు చేసి చట్టరీత్యా చర్యతిసుకొని వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చెయడం జరిగినది.
ఇట్టి కార్యక్రమంలో మాలల ఐక్యవేదిక కన్వీనర్ తుంగ శివరాజ్, కో కన్వీనర్ జక్కుల యాదగిరి, జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు నీరటి శ్రీనివాస్ వేములవాడ డివిజన్ కన్వీనర్ బత్తుల కమలాకర్ కోనరావుపేట మండల అధ్యక్షులు మందాల శ్రీనివాస్,
ఐక్యవేదిక జిల్లా నాయకులు అంగూరి సుధాకర్ గారు ఉపాధ్యక్షులు మాదాసు భూమయ్య, ప్రధాన కార్యదర్శి కులేరు బాబు, కోశాధకారి కులేరు చంద్రయ్య, కోనరావుపేట సంఘ అధ్యక్షులు యాస శ్రీనివాస్,జిల్లా కమిటీ సభ్యులు నక్క పర్శరాములు మాదాసు స్వామీ, నీరటి కిరణ్,యాస సదానందం తదితరులు పాల్గొన్నారు.




