Malyala: మల్యాల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మెన్నేని స్వర్ణలత
Malyala: జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మెన్నేని స్వర్ణలత, వైస్ చైర్‌పర్సన్‌గా సంథా ప్రకాష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.
మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) నూతన పాలకవర్గాన్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా మెన్నేని స్వర్ణలత, వైస్ చైర్‌పర్సన్‌గా సంథా ప్రకాష్ రెడ్డి నియమితులయ్యారు. వీరితో పాటు మరో 16 మందికి డైరెక్టర్లుగా సభ్యులుగా కమిటీలో చోటు కల్పించారు. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ఈ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే వరకు పదవిలో కొనసాగనుంది.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు:
నూతన చైర్‌పర్సన్‌గా నియమితులైన మెన్నేని స్వర్ణలత, ఆమె భర్త రాజనర్సింగరావుతో పాటు వైస్ చైర్‌పర్సన్, నూతన కమిటీ సభ్యులు చొప్పదండి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో ఈ కీలక బాధ్యతలు అప్పగించడంలో సహకరించిన ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ సమగ్రాభివృద్ధికి, ప్రాంతీయ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అందరినీ కలుపుకొని సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.




