Karimnagar: పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి కీలక ఆదేశాలు!
Karimnagar: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.
Karimnagar: పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి కీలక ఆదేశాలు!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ రోజు ప్రత్యేక అధికారి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై శాఖల వారిగా సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం అందిస్తున్న స్కీంలను శాఖల వారిగా అధికారులు వివరించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పేద ప్రజలకు భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్తుతోపాటు పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
సమస్యలపట్ల స్పందిస్తూ అధికారులు తప్పకుండా పని చేయాలని, లేదంటే వెళ్లిపోవాలని హెచ్చరించారు. గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, అధికారులు మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు గౌరవించుకుంటూ పనులు చేయాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు సమస్యలు తెలిపినపుడు వెంటనే అధికారులు స్పందించాలని అన్నారు. ఫిర్యాదులు రాకుండా అధికారులు చూడాలని కోరారు.
గ్రామాల వారిగా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పార్టీలకతీతంగా పని చేస్తానని హామీచ్చారు. వ్యవసాయం, విద్య, విద్యుత్, వైద్యంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. వరి వేయకుండా కాలాగుణంగా రైతులు వ్యవసాయ పద్దతులను మార్చుతూ పంటల మార్పిడి విధానాన్ని పాటించాలని, తక్కువ నీటితో లాభసాటి పంటలను సాగు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇండ్లలో, రోడ్లపైన, మురికి కాలువల్లో నీరు నిల్వలేకుండా గ్రామాల్లో జాగ్రత్తలు తీసుకుంటే రోగాల నుండి కాపాడుకోవచ్చన్నారు. విద్యకు ప్రాధాణ్యతనిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అవగాహాన కోసం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయలును విదేశాలకు పంపిస్తుందని తెలిపారు. ఈ నెల 23న మానకొండూర్ లో మామో గ్రఫీ స్క్రీనింగ్ పరీక్షళు నిర్వహించి మహిళలకు క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నట్లు, దీనిని నియోజకవర్గంలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
చెరువుల కబ్జాపై చర్చ విషయంలో మొగిలిపాలెం సర్పంచ్, సొసైటీ చైర్మన్ల మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సర్పంచ్ ని ఎమ్మెల్యే వారించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శ్రీధర్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్ర, తాసీల్దార్ కర్ర శ్రీనివాస రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సొసైటీల చైర్మన్లు పాల్గొన్నారు.




