Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో దివ్యాంగుల క్రీడోత్సవాలు!

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో దివ్యాంగ విద్యార్థుల మండల స్థాయి క్రీడోత్సవాలు ఎంఈఓ మహేష్ ప్రారంభం ఉత్సాహంగా పాల్గొన్న చిన్నారులు, విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాల అందజేత.

Srimanthula Kondal, Peddapalli
Published on: 29 Sept 2026 6:25 PM IST
Kalva Srirampur
X

Kalva Srirampur: కాల్వ శ్రీరాంపూర్‌లో దివ్యాంగుల క్రీడోత్సవాలు!

Kalva Srirampur: పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి దివ్యాంగుల క్రీడాపోటీలు మంగళవారం ఘనంగా జరిగాయి. మండల విద్యాధికారి (MEO) సిరిమల్ల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను ప్రారంభించారు. మండలంలోని వివిధ పాఠశాలల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.

​ఈ సందర్భంగా ఎంఈఓ మహేష్ మాట్లాడుతూ.. దివ్యాంగ పిల్లలు ఎంతమాత్రం సాధారణ పిల్లలకు తీసిపోరని, వారిలో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో తోడ్పడతాయని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన IERP సుమలత, స్పెషల్ ఎడ్యుకేటర్ వనజలను ఆయన అభినందించారు.

​ZPHS శ్రీరాంపూర్ హెచ్‌ఎమ్ వెంకటేష్ మాట్లాడుతూ, పిల్లల్లోని నైపుణ్యాలను గుర్తించి తల్లిదండ్రులు ఎల్లప్పుడూ ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం MPPS హెచ్‌ఎమ్ అత్తె రాజారాం మాట్లాడుతూ.. దివ్యాంగ పిల్లలు దేవుడిచ్చిన వరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అవగాహన చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

​పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా మెడల్స్, మెమెంటోలు మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ PET బాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Srimanthula Kondal, Peddapalli

Srimanthula Kondal, Peddapalli