Thimmapur: ఆలయ భూమి పరిరక్షణకు మన్నెంపల్లి గ్రామస్తుల ఐక్య పోరాటం!
Thimmapur: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూమిని పరిరక్షించాలని కోరుతూ గ్రామస్తులు బుధవారం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
Thimmapur: ఆలయ భూమి పరిరక్షణకు మన్నెంపల్లి గ్రామస్తుల ఐక్య పోరాటం!
కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 5లోని భూమిని పరిరక్షించాలని కోరుతూ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎండోమెంట్ కమిటీ సభ్యులు, కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు కలిసి తిమ్మాపూర్ తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.
గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి చెందిన భూమి ఆలయ ఆస్తిగా భద్రంగా ఉండాలని, ఆ భూమికి సంబంధించిన హక్కులు, రికార్డులను పరిశీలించి భూమి పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఆలయ భూములు ఆక్రమణలకు గురికాకుండా రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఆలయ ఆస్తులను కాపాడాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.
గ్రామ ఆధ్యాత్మిక, చారిత్రక వారసత్వానికి ప్రతీకగా నిలిచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ భూమిని పరిరక్షించడం గ్రామ ప్రజలందరి బాధ్యత అని, ఈ భూమిని కాపాడేందుకు గ్రామ ప్రజలంతా ఐక్యంగా ముందుకు వచ్చారని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొన్నం సునీత అనిల్ గౌడ్, ఉప సర్పంచ్ బూడిద కిషోర్, వార్డు సభ్యులు గుంటి రామచంద్రం, సుదగోని పరశురాములు, సంధి లక్ష్మి, మాజీ సర్పంచులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, మేడి అంజయ్య, ఎండోమెంట్ చైర్మన్ బుర్ర కనుకయ్య, ఎండోమెంట్ సభ్యులు గుంటి శ్రీనివాస్, పొట్ట శ్రీనివాస్, కుల సంఘాల అధ్యక్షులు కొలిపాక రామస్వామి, నాయకులు నర్ల అశోక్, గుర్రం జగదీశ్, దారిపెల్లి రమేష్, అశోద అంజయ్య, కామెర రవి, పోతుగంటి శ్రీనివాస్, రావుల శ్రీనివాస్, దుర్గం శ్రీనివాస్, మార్క సారయ్య, కొయ్యడ రాములు, తిరుపతి, బెనపెల్లి శ్రీనివాస్, తలపెల్లి కొమురయ్య, తలపెల్లి కిరణ్, గోదారి చిరంజన్ కుమార్, వేముల దేవేందర్, ఎం.డి. జాఫర్, పాములుగారి రాజకుమార్, గుంటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.




