Manthani: టీయూడబ్ల్యూజే హెచ్-143 కమిటీకి ఎన్నికైన జర్నలిస్టులకు సన్మానం
Manthani: మంథని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్లో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అంకరి ప్రకాష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు పినగాని శ్రావణ్ కుమార్‌లకు ఘన సన్మానం.
Manthani: టీయూడబ్ల్యూజే హెచ్-143 కమిటీకి ఎన్నికైన జర్నలిస్టులకు సన్మానం
మంథని: తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్లూజే హెచ్-143) ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా మరోసారి ఎన్నికైన నమస్తే తెలంగాణ పెద్దపల్లి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ అంకరి ప్రకాష్‌తో పాటు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైన మంథని 10టీవీ ప్రతిధి పినగాని శ్రావణ్ కుమార్ లను శనివారం మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో సహచర జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జంజర్ల శంకర్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నూతనంగా బాధ్యతలు చేపట్టిన వారు మరింత అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.
ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర కమిటీకి ఎన్నికైన ప్రకాష్, శ్రవణ్ కుమార్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంథని డివిజన్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మాచిడి కిరణ్ గౌడ్, కార్యదర్శి బండ లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు చిట్టిమెల్ల సంతోష్ తోపాటు పెరుగు రాకేష్, బండారి సురేష్, తంబూరి తిరుమలేష్ తదితరులు ఉన్నారు.




