Manthani: దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి
Manthani: నవంబర్ 29న కరీంనగర్ అలుగునూర్‌లో కేటీఆర్ నాయకత్వంలో జరిగే దీక్షా దివస్ సభ పోస్టర్లను మంథనిలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆవిష్కరించారు.
Manthani: దీక్షా దివస్ బహిరంగ సభను విజయవంతం చేయాలి
మంథని: ఈ నెల 29న కరీంనగర్ అలుగునూర్‌లో నిర్వహించే దీక్షా దివస్ బహిరంగ సభను పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్ణణంలోని రాజగృహాలో దీక్షా దివస్ బహిరంగ సభ వాల్ పోస్టర్‌లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వంలో జరిగే సభ నేటి యువతకు చరిత్ర తెలిసేలా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ దీక్షా దివస్ బహిరంగ సభకు నియోజకవర్గంలోని పార్టీశ్రేణులు, అభిమానులు,ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




