Manthani: అల్లం బుచ్చమ్మ పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేల నివాళులు
Manthani: గాజులపల్లిలో అల్లం నారాయణ తల్లి బుచ్చమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, కోరుకంటి చందర్. కుటుంబ సభ్యులకు సంతాపం.
Manthani: అల్లం బుచ్చమ్మ పార్థివదేహానికి మాజీ ఎమ్మెల్యేల నివాళులు
మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాజులపల్లి గ్రామంలో తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ గారి తల్లి బుచ్చమ్మ మృతి చెందగా, వారి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
అనంతరం అల్లం నారాయణ గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బుచ్చమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి వెంట బిఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు.




