Manthani: మంథనిలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు: ముఖ్య అతిథిగా పుట్ట మధు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ నగర్‌లో ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమం. ఓటర్లు అప్రమత్తంగా ఉండి ప్రక్రియ పూర్తి చేసుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు.
Manthani: మంథనిలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు: ముఖ్య అతిథిగా పుట్ట మధు!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ నగర్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలను ఉద్దేశించి పుట్ట మధు మాట్లాడుతూ ఎస్ఐఆర్ కు సంబంధించిన పూర్తి వివరాలను టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఓటే ఒక ఆయుధమని ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వచ్చి అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని కోరారు. నిర్దేశిత గడువులోగా సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని సూచించారు. ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత అధికారులను సంప్రదించి సరైన సమాచారం తెలుసుకోవాలని ఆయన అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ ను అశ్రద్ధ చేయకుండా నిర్ణయిత సమయంలో పూర్తి చేసుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




