Manthani: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై పుట్ట మధు తీవ్ర విమర్శలు

Manthani: మంథనిలో న్యాక్ సెంటర్ ప్రారంభంపై ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. 32 నెలల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శ.

SHANKAR, MANTHANI
Published on: 19 July 2026 7:33 PM IST
Manthani
X

Manthani: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుపై పుట్ట మధు తీవ్ర విమర్శలు

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ....తెలంగాణ రాష్ట్రంలోనే అద్బుతం సృష్టించినట్లుగా గొప్పగా ప్రచారం చేసుకుంటున్న మంథనిలో న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌ సమాజానికి జవాబు చెప్పాలని పుట్ట మధూకర్‌ డిమాండ్‌ చేశారు.

పనితనాన్ని చూస్తే జాలి కలుగుతాందని అన్నారు. దుద్దిళ్ళ కుటుంబం ఓట్ల కోసం అలవాటు పడిందని, ఓట్ల కోసం తప్ప అభివృద్ది కోసం ఏనాడు ఆలోచన చేయడం లేదని ఆయన అన్నారు, ఈ విషయాలను సమాజం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన గుర్తు చేశారు. మంథనికి న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చినా అని ఎదో గొప్పలు చెప్పుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

32 నెలలు గడిచిన తర్వాత ఈ సెంటర్‌ తీసుకువచ్చినందుకు ఎమ్మెల్యే అవమాన పడాలని అన్నారు. 2004 నుంచి 2009 మధ్యలోనే జీవన్‌రెడ్డి జగిత్యాలకు తీసుకువచ్చారని ఆయన గుర్తు చేశారు. సమాజం మీద ధ్యాస ఉంటే అభివృద్ది చేయాలనే ఆలోచన ఉంటే ఈ న్యాక్‌ సెంటర్‌ ఎప్పుడు తీసుకువచ్చే వారని ఆయన అన్నారు.

దుద్దిళ్ళ కుటుంబం ఎనిమిదో సారి ఎమ్మెల్యే స్థానంలో ఉన్నారని, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌ 25 ఏండ్లు ఆయన తండ్రి 15 ఏండ్లుగా అధికారంలో ఉంటున్నారని ఆయన తెలిపారు. మొదటి సారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అయిన పొన్నం ప్రభాకర్‌ గత మార్చిలోనే న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చారని, ఆనాడు రూ.20కోట్లు తీసుకువస్తే ఈనాడు రూ.40కోట్లు తీసుకురావాలే కానీ కేవలం రూ.20 కోట్లు తెచ్చి గొప్పలు చెప్పుకోవడం, దాన్ని పత్రికలు గొప్పగా రాయడం చాలా బాధాకరమన్నారు.

అసలు నూతన భవనం నిర్మాణం అయిన తర్వాత న్యాక్‌ సెంటర్‌ ప్రారంభిస్తారా లేక అద్దె భవనంలో ప్రారంభిస్తారో క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచిపోతుంది. పెద్దపల్లి కాటారం రోడ్డు పూర్తి చేయడానికిt ఐదు ఆరు కోట్లు నిధులు వెచ్చించలేక పోయారని, ప్రజలు సైతం రోడ్డెక్కి ధర్నా చేశారని ఆయన ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇలాంటి పనులు పూర్తి చేయాలే కానీ 32 నెలల తర్వాత న్యాక్‌ సెంటర్‌ తీసుకువచ్చి ఏదో గొప్ప పని చేశామని చెప్పుకోవడం విడ్డూరమన్నారు. మంత్రిగా 32 నెలల్లో ఏం చేసిండని ఆలోచన చేయాలని, ఈ విషయంపై పత్రికలు రివ్యూ చేసి కథనాలు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఆనాడే జీవన్‌రెడ్డి జగిత్యాలలో 2009 ముందు 20 కోట్లతో భవనం కట్టిండని, అలాంటి భవనం కట్టాలంటే ఈనాడు 40 కోట్లు కావాలని కానీ మంథని ఎమ్మెల్యే తీసుకువచ్చిన 20 కోట్లు తక్కువే కదా అని ఆయన అన్నారు. ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ సమాజం నీ కుటుంబానికి అవకాశం ఇస్తే అధికారంలోకి వచ్చినంక ఈ సమాజం గురించి ఏమీ ఆలోచించలేదని, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు ఇప్పటికే 32 నెలలు గడిచిపోయిందని, మరో నాలుగు మాసాలు అయితే కాలం గడిచిపోతుందని అన్నారు.

32 నెలల తర్వాత న్యాక్‌ సెంటర్‌ ఎందుకు తెచ్చినవో సమాజానికి జవాబు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. పొన్నం ప్రభాకర్‌ మొదటిసారి ఎమ్మెల్యే ఆయనంక మార్చిలోనే జీఓ తెచ్చిండని, ఫస్ల్‌ టైం ఎమ్మెల్యే కన్నా వెనకబడి ఉన్నావని ఆయన విమర్శించారు. సొంత నియోజకవర్గం కాకపోయినా పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ బిడ్డగా నీకన్నా ముందు పని చేస్తున్నాడని, కూలగొట్టుడు, అక్రమ కేసులు పెట్టడం తప్ప అభివృద్ది మీద దృష్టి లేదన్నారు. అభివృద్ది పనులకు కాగితాలను చూపించి మోసం చేయద్దని, న్యాక్‌ సెంటర్‌ను ఎప్పుడు ప్రారంభిస్తరో, ఆలస్యం అయినందకు కారణం చెప్పాలని ఆయన ఈ సందర్బంగా డిమాండ్‌ చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story