Manthani: రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో రేపు నలుగురు మంత్రుల పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, లబ్ధిదారులకు చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ.

SHANKAR, MANTHANI
Published on: 18 Aug 2026 7:13 PM IST
Manthani
X

Manthani: రేపు మంథనిలో నలుగురు మంత్రుల పర్యటన.. వివరాలు

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రేపు రాష్ట్రానికి చెందిన నలుగురు మంత్రులు పర్యటించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో పాటు రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సీ–ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు గంగాపురి వద్ద న్యాక్ స్కిల్ డెవలప్‌మెంట్ భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 2.20 గంటలకు మంథని పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద సీఎస్‌ఆర్ నిధులతో నాలుగు మండలాల్లోని తొమ్మిది గ్రామాలకు మంజూరైన తొమ్మిది వైకుంఠ రథాలను ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 2.30 గంటలకు మంథని బస్ డిపో వద్ద రూ.164.64 కోట్ల విలువైన పలు రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో మంథని పట్టణంలోని డ్రెయిన్లు, సెంట్రల్ లైటింగ్, రోడ్ల విస్తరణతో పాటు మంథని–డిగ్రీ కళాశాల, మంథని–గోదావరి నాలుగు వరుసల రహదారి, సూరయ్యపల్లి–సీతంపేట, గుంజపడుగు–విలోచవరం, కూనారం–ముత్తారం రహదారి పనులు ఉన్నాయి. ఆ తర్వాత

మధ్యాహ్నం 3 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నాలుగు మండలాల లబ్ధిదారులకు రేషన్ స్మార్ట్ కార్డులు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు, సీఎంఆర్‌ఎఫ్ సహాయం, మైనార్టీలకు కుట్టు మిషన్లు, మహిళా స్వశక్తి సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story