Manthani: 24న మంథనిలో గౌతమేశ్వర స్వామి కల్యాణం, జ్వాలాతోరణం
Manthani: కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న మంథనిలో శ్రీ గౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి కల్యాణ మహోత్సవం, జ్వాలాతోరణం; భక్తులకు ఆహ్వానం.
Manthani: 24న మంథనిలో గౌతమేశ్వర స్వామి కల్యాణం, జ్వాలాతోరణం
మంథని: పవిత్ర కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథని పవిత్ర గోదావరి నదీ తీరాన కొలువుదీరిన శ్రీగౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని, జ్వాలాతోరణ కార్యక్రమాన్ని, ఆలయంలో ఈనెల 24న మంగళవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించినున్నట్లు బండారి గురుస్వామి శిష్య పరివార్, ఆకుల విద్యాసాగర్ ఆదివారం తెలిపారు.
ఈ పవిత్ర వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని, దైవానుభూతిని కలిగించేలా నిర్వహించబడతాయని, గోదావరి తీరాన జరిగే ఈ మహోత్సవానికి మంథని పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల భక్త మహాశయులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కల్యాణాన్ని దర్శించుకొని, జ్వాలాతోరణ కార్యక్రమంలో పాల్గొని శ్రీ గౌతమేశ్వర స్వామి సమేత గంగాభవాని అమ్మవారి దివ్య అనుగ్రహాన్ని పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు.




