Manthani: గత ప్రభుత్వ రీడిజైనింగ్‌తోనే తీరని నష్టం: మంత్రి!

Manthani: మంథనిలో 3 బ్యారేజీలు ఉన్నా ఎకరానికి నీరందలేదని మంత్రి శ్రీధర్‌బాబు విమర్శించారు. లద్నాపూర్‌లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌తో కలిసి పర్యటించి ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

SHANKAR, MANTHANI
Published on: 27 Oct 2026 8:25 PM IST
Manthani
X

Manthani: గత ప్రభుత్వ రీడిజైనింగ్‌తోనే తీరని నష్టం: మంత్రి!

మంథాని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజవర్గంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి పర్యటించారు. కమాన్‌పూర్, రామగిరి, మంథని మండలాల్లో మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి, ఎమ్మెల్యే.. రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో బాల వికాస్ నీటి శుద్ధీకరణ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఆ తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ సోషల్ మీడియాను ఉపయోగించుకుని కొంతమంది కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు ఎదురైనా మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారని గుర్తుచేశారు.

సాంకేతిక కారణాలు, గత ప్రభుత్వ రీడిజైనింగ్‌తో ప్రాజెక్టు పక్కకు వెళ్లిందన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన మూడు బ్యారేజీల కోసం మంథని ప్రాంత ప్రజలు భూములు, ఇళ్లు, ఇతర వనరులను కోల్పోయారని.. అయినా సాగునీరు అందకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అనేక ప్రాంతాల రైతులు సైతం ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ తర్వాత లద్నాపూర్ లో స్టేజ్ పైన మంథనిలోనీ ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఘాట్ వాఖ్యలు చేశారు.

తాను మంచివాడినేనని, అయితే మంత్రి శ్రీధర్ బాబులా అంత మంచివాడిని కాదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులకు అండగా ఉంటానని, ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే తనకు ఫోన్ చేయాలని అన్నారు. గతంలో కొందరు కిరాయి గుండాలతో హత్యలు చేయించారని ఆరోపిస్తూ, తాము అలాంటి పనులు చేయబోమని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సమాధానం చెబుతామంటూ హెచ్చరించారు. మంథని నియోజకవర్గంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI