Manthani: మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

Manthani: పెద్దపల్లి జిల్లా మంథనిలో అభివృద్ధి పనులను తనిఖీ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. నాణ్యతతో పనులు పూర్తి చేయాలని, రోడ్డు వెడల్పు పనుల పరిశీలన.

SHANKAR, MANTHANI
Published on: 21 July 2026 3:50 PM IST
Manthani
X

Manthani: మంథనిలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అంతకుముందు కుటుంబ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, అనంతరం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేశారు.

స్థానిక అధికారులతో కలిసి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిర్ణీత గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు అనారోగ్యంతో మృతి చెందిన తన మేనత్త అంత్యక్రియల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన అనంతరం, మంథనిలోనీ ఆర్టీసీ బస్ డిపో వద్ద చేపడుతున్న రోడ్డు వెడల్పు పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story