Manthani: బొక్కల వాగు కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ చైర్మన్ తనిఖీ!

Manthani: మంథని బొక్కల వాగు కట్ట కూరగాయల మార్కెట్‌ను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, కమిషనర్ మనోహర్. వ్యాపారులకు వసతుల కల్పనపై హామీ.

SHANKAR, MANTHANI
Published on: 18 July 2026 1:05 PM IST
Manthani
X

Manthani: బొక్కల వాగు కూరగాయల మార్కెట్‌లో మున్సిపల్ చైర్మన్ తనిఖీ!

Manthani: పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బొక్కల వాగు కట్టపై ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లోని వ్యాపారులతో సమావేశమై వారికి అవసరమైన సౌకర్యాలపై చర్చించారు.

ప్రజలకు, వ్యాపారులకు మరింత అనుకూలంగా ఉండేలా అన్ని విధాల చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. అలాగే మార్కెట్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, చెత్తను బయట వేయకుండా మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందజేయాలని సూచించారు. స్వచ్ఛత, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, వ్యాపారులు అందరూ సహకరించాలని ఆయన కోరారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story