Manthani: మంథనిలో ఘనంగా నంది అవార్డు గ్రహీతల సత్కారం

Manthani: మంథనిలో నంది అవార్డు గ్రహీతలను సత్కరించిన మూవీ మేకర్స్ ఫోరం. సామాజిక స్పృహతో సినిమాలు తీయాలని యువ దర్శకులకు నిపుణుల సూచన. పాలుపంచుకున్న ప్రముఖులు.

SHANKAR, MANTHANI
Published on: 19 July 2026 6:48 PM IST
Manthani
X

Manthani: మంథనిలో ఘనంగా నంది అవార్డు గ్రహీతల సత్కారం

మంథని: షార్ట్ ఫిల్మ్స్ మూవీ మేకర్స్ ఫోరం ఆధ్వర్యంలో నంది అవార్డు గ్రహీతల సత్కార సభ ఆదివారం మంథని విద్యార్థి యువత కర్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు వ్యాపార ధోరణి కాకుండా ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చిత్రాలు రూపొందించాలని సూచించారు.

సమాజానికి ఉపయోగపడే అంశాలను తెరకెక్కించడమే అసలైన సినిమా లక్ష్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్థాయి నంది అవార్డు గ్రహీతలతో పాటు, స్థానిక షార్ట్ ఫిల్మ్ నటీమణి పుష్ప, సుమధుర గాయని జవహరిని ఫోరం సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ సభకు అధ్యక్షత వహించిన చలనచిత్ర సెన్సార్ బోర్డు పూర్వ సభ్యులు బోగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా అంటే కేవలం వాణిజ్యం కోసమే కాకుండా జనహితం కోసం ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. యువ దర్శకులు సామాజిక స్పృహతో సినిమాలు తీయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, రైటర్ నారమల్ల కృష్ణ, షార్ట్ ఫిల్మ్ హితులు రవితేజ గౌడ్, ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI

Next Story