Manthani: మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు
Manthani: మంథనికి విచ్చేస్తున్న గణపతి సచ్చిదానంద స్వామీజీ. శివకిరణ్ గార్డెన్లో ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, డీసీపీ రాంరెడ్డి.
Manthani: మంథనిలో గణపతి సచ్చిదానంద స్వామీజీ పర్యటనకు ఏర్పాట్లు
మంథని: మైసూర్ దత్త పీఠం పూజ్య గురుదేవులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి విచ్చేయనున్న నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని శివకిరణ్ గార్డెన్లో స్వామీజీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ మేరకు కార్యక్రమ వేదిక వద్ద చేపట్టిన ఏర్పాట్లను పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్, పాలకవర్గ సభ్యులు పెంటరి రాజు, ఎల్లెంకి వంశీధర్, మంథని సీఐ బి. స్వామి, ఎస్ఐ ఎన్. సందీప్ కుమార్ తదితరులు పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆహ్వానం మేరకు లోకకల్యాణం కోసం పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామీజీ మంథనికి విచ్చేస్తున్నారని తెలిపారు. ఈ పవిత్ర కార్యక్రమానికి మహిళలు, భక్తులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామీజీ ఆశీస్సులు పొందాలని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.




